నేటి నుండే దేవీ సరన్నవరాత్రులు

DRK Raju
విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వేంచేసివున్న అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గ అమ్మవారి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు రేపు ఆదివారం నుండి అక్టోబర్ 8 వ తేదీ వరకు అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి నట్లు దేవాదాయ శాఖ సంయుక్త కమీషనర్ ,శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి సురేష్ బాబు శనివారం  ఎపీ హెరాల్డ్ ప్రతినిధికి తెలిపారు. వినాయక ఆలయం నుండి అమ్మ వారి గుడి వరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఏ ఇబ్బందులు కలుగకుండా మంచినీరు,పాలు,మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


ప్రతి రోజు తెల్లవారు ఝామున 3 గంటలనుంది రాత్రి 11 గంటలవరకు అమ్మవారి దర్శనం  చేసుకునే ఏర్పాట్లు చేశామన్నారు. పది రోజులపాటు ప్రతి రోజు వివిధ అలంకారములతో అమ్మవారు దర్శనం ఇస్తారని మొదటి రోజు  స్వర్ణ కవచాలంకృతదుర్గాదేవిగాను పదవ రోజు రాజరాజేశ్వరి దేవిగాను దర్శనమిస్తారని తెలిపారు. సామాన్యులకు వి ఐ పి లకు ఏవీధమైన అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు ద్వారా దర్శించుకోవచ్చన్నారు.
అమ్మవారి దర్శనానికి రాగోరే వి ఐ పి లు తమ వాహనాలను  స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశం లో తమ వాహనాలు పార్క్ చేసి అక్కడనుండి ఏర్పాటు చేసిన ఆలయ వాహనాల్లో వచ్చి దర్శనం  చేసుకోవాలని సురేష్ బాబు కోరారు.



సమాచారం కోసం పున్నమి ఘాట్ లో ఒకటి,స్టేట్ గెస్ట్ హౌస్ లో మరొక సమాచార కేంద్రం ఏర్పాటు చేశామని, అవసరమైన సమాచారం వాటి ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఇలా ఉండగా ఈ సాయంత్రం నుండే ఇంద్రకీలాద్రి కి భక్తుల రాక ప్రారంభమైందని, రక్షణ ఏర్పాట్లు కూడా పూర్తీగా పటిష్టంగా ఉన్నట్లు కాగా విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకాతిరుమలరావు ఇప్పటికే  మీడియాతో మాట్లాడుతూ కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నందున పరీవాహక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయటం తోపాటు అన్ని బందోబస్ట్ ఏర్పాట్లు చేశామని,మొత్తం 4,500 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకి నియమించమన్నారు.ట్రాఫిక్ నియంత్రణకు ఒక ప్రత్యేక యాప్ ని రూపొందించమని ఇప్పటికే కమీషనర్ ద్వారకా తిరుమల రావు తెలియచేశారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: